హైదరాబాద్, ఉప్పల్ లోని లాలాపేట డివిజన్ పరిధిలోని ఇసుక బావి ప్రాంతంలో భారత మాజీ ఉపప్రధాని, దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి, ముఖ్యంగా సామాజిక న్యాయం, దళితుల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.