అంబర్ పేట్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్నాక నుండి రామంతపూర్ వెళ్లే ఫ్లైఓవర్ పైనుంచి డివైడర్ ను ఢీకొని సర్వీస్ రోడ్డుపై పడి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి 12 గంటలకు జరిగిన ఈ ఘటనపై కాచిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీం సహాయంతో మృతికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.