ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న షంషీర్ అల
ీ ఖాన్ (32)ను అరెస్ట్ చేశారు. నల్ల చెరువు కట్ట బస్ స్టాప్ వెనుక తనిఖీలు చేపట్టిన అధికారులు, అతని వద్ద నుంచి 4.2 కిలోల ఎండిన గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నారపల్లిలోని ఫాస్ట్ ఫు
డ్ సెంటర్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద 4 గ్రాముల చొప్పున ప్యాక్ చేసిన 1,014 గంజాయి ప్యాకెట్లు లభించాయి.