మల్లాపూర్ డివిజన్‌లోని దుర్గానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అవసరమైన వస్తువులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.