GHMCలో 20 పట్టణాలు, 7 నగరాల విలీనం: రాజకీయ నాయకులకు షాక్

3చూసినవారు
GHMCలో 20 పట్టణాలు, 7 నగరాల విలీనం: రాజకీయ నాయకులకు షాక్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాజకీయంగా ఎదగాలనుకునేవారికి, స్థానిక సంస్థల్లో పదవులు ఆశించిన వారికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్ గా రాణించాలని చూసిన వారికి మున్సిపాలిటీలుగా మారిన తర్వాత అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు పట్టణాలను బల్దియాలో విలీనం చేయడంతో రాజకీయ అవకాశాలు 30%పైగా తగ్గుముఖం పట్టనున్నాయని అంచనా వేస్తున్నారు. నిరుద్యోగం విద్యార్థులనే కాదు, రాజకీయ నాయకులను సైతం వెంటాడుతోందని, మహా నగరంలో రాజకీయంగా ఎలా ఎదగాలనే దానిపై నాయకులు ఆలోచనలో పడ్డారని ఈ వార్త తెలియజేస్తోంది.

సంబంధిత పోస్ట్