మేడ్చల్ నియోజకవర్గ
బీజేపీ ఇంచార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్‌లోని ఉప్పల్ జోన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను మంగళవారం కోరారు. మేడిపల్లి చెరువు ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.