ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ ఉమెన్స్ కమిటీ, ఎన్జీవో స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు.