కురుమ కుల సోదరుల ఆత్మగౌరవ ప్రతీకగా చిరస్థాయిలో నిలిచిపోయేలా ఉప్పల్ కురుమ సంఘం భవనానికి శంకుస్థాపన చేయటం జరిగింది. సుమారు 450ఏండ్ల చరిత్ర గల ఉప్పల్ బీరప్ప స్వామి దేవాలయం బీరప్పగడ్డలో కొత్త భవనం నిర్మాణంకు శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి, కురుమ సంఘం నాయకులు కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం కురుమ, తదితరులు పాల్గొన్నారు.