హబ్సిగూడ, స్ట్రీట్ నం. 8 లో దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం చేస్తున్న ఫాగింగ్ చర్యలను ఎం ఎం సి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ, ప్రతిరోజూ ఫాగింగ్ జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు రోజు ఫాగింగ్ జరుగుతుందని తెలిపారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తనను నేరుగా ఆఫీసులో కలవచ్చని కమిషనర్ సూచించారు. ఎంటమాలజీ సిబ్బందితో మాట్లాడుతూ, క్రమం తప్పకుండా అన్ని ప్రాంతాలలో, గల్లీలలో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు.