మహబూబ్ నగర్ జిల్లా మహమ్మాదాబాద్ మండల్ నంచర్ల బోరింగ్ తాండ గ్రామానికి చెందిన ముడావత్ శ్రీను, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ బి. లావణ్య పర్యవేక్షణలో 'ఏ స్టడీ అఫ్ ఔరంగజెబ్ క్యారెక్టర్ అండ్ హిస్ డెక్కన్ వ్యూవ్' అనే అంశంపై సమగ్ర పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. మారుమూల గ్రామం నుండి వచ్చి ప్రతిష్టాత్మక ఓయూ చరిత్ర విభాగంలో డాక్టరేట్ సాధించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.