చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రిపురం లో గతంలో డ్రైనేజ్ సమస్యపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరీ మహేష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకుడు మొగలి రావు, రెడ్డి కాలనీ అధ్యక్షుడు గడ్డల పాండు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సోమస్వామి, అశోక్ కాలనీ ఉపాధ్యక్షులు కొండారెడ్డి తదితరులు పాల్గొని పనులను పరిశీలించారు.