ఎన్.ఎస్.యు.ఐ. 56వ ఆవిర్భవ దినోత్సవం కోట దుర్గారాజ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్.ఎస్.యు.ఐ. ఇందిరాగాంధీ ఆలోచనలతో పుట్టి, అనేక మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను అందించిన విద్యార్థి సంఘమని వెంకటస్వామి పేర్కొన్నారు.