గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు, అభ్యర్థుల స్నేహితులు, బంధువులు ప్రచారంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారు కూడా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పలువురు విద్యార్థులు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు.