శంకరపట్నం: మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన రెడ్డి కొమరయ్య, శోభ దంపతుల కుమారుడు రెడ్డి విజ్ఞాన్ తేజ (మైనింగ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి) సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆక్సిజన్ పార్కులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్యతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. స్వగ్రామానికి తెచ్చిన కుమారుని మృతదేహాన్ని చూసి కన్నతల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. యువతరం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులను తీవ్ర దుఃఖంలోకి నెడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.