మల్లాపూర్ డివిజన్‌లో 'బస్తిబాట' కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు బయటపడ్డాయి. పలు బస్తీలలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు, కుక్కల బెడద పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద సరైన వెలుతురు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ నెమలి అనిల్ కుమార్ విద్యుత్ డీఈ సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు.