రైల్వే ఉద్యోగాల కోతలకు వ్యతిరేకంగా పోస్ట్‌కార్డు ఉద్యమం

0చూసినవారు
రైల్వే ఉద్యోగాల కోతలకు వ్యతిరేకంగా పోస్ట్‌కార్డు ఉద్యమం
భారత రైల్వేలో 2 శాతం ఉద్యోగాల కోత (సుమారు 29,608 పోస్టులు) నిర్ణయాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే ఉన్న మూడు లక్షల ఖాళీలను భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఆర్ఆర్ బీ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దిల్సుఖ్ నగర్ లో భారీ స్థాయిలో పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. ఆర్ఆర్ బీ అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ ప్రధానికి, రైల్వే మంత్రికి వేలాది పోస్ట్ కార్డులు పంపారు.

సంబంధిత పోస్ట్