
బాబోయ్ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి (వీడియో)
AP: తిరుమలలో ఏడు అడుగుల ఎత్తైన మహిళ సందడి చేసింది. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో కలిసి శ్రీలంకకు చెందిన నెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమెను అంత పొడుగ్గా ఉండటాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తర్జిని శ్రీలంక నెట్‌బాల్ జట్టులో కీలక క్రీడాకారిణిగా రాణించగా, ఆసియా నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని దేశానికి కీర్తి తెచ్చిపెట్టారు.




