తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం...

0చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో పేదల భూముల యాజమాన్య హక్కుల సాధనకై సమీక్ష సమావేశం జరిగింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సమావేశంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ నండ్రు నరసింహ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్