తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను ఆయన ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను అందజేశారు.