శుక్రవారం రాత్రి కుషాయిగూడలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ లో గుర్తు తెలియని దుండగుడు కత్తితో బెదిరించి రెండు లక్షల నగదు దోచుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన దొంగ అమెరికా పౌరుడిగా గుర్తించబడ్డాడు.