
టీ పెట్టలేదని భార్య గొంతు కోసిన భర్త, అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య టీ పెట్టడానికి నిరాకరించిందని ఆగ్రహించిన భర్త మనోజ్ సోని.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. లతా సోని అనే మహిళ తన ఇంటి పై అంతస్తు గదిలో మృతదేహంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్తను పోలీసులు నర్సింగ్‌పూర్-కరేలి రోడ్డులోని సిద్ధ బాబా ఆలయం వెనుక ఉన్న పొలంలో అరెస్ట్ చేశారు.




