ఫేక్ డిగ్రీతో షాక్..! హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్

3చూసినవారు
ఫేక్ డిగ్రీతో షాక్..! హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ బీకాం డిగ్రీ పట్టాలను తయారుచేస్తున్న రాకెట్ గుట్టు రట్టయింది. మహేశ్వరి అలియాస్ రేష్మ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించగా, నకిలీ బీకాం డిగ్రీ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ డిగ్రీలు 2009 నుంచి వాడుకలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మహిళ సరైన సమాధానం చెప్పలేకపోవడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్