భారత ఎన్నికల సంఘం చేపట్టిన 'సర్' ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం, ఉప్పల్ నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ కలిసి ఉమ్మడి కాప్రా డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ బూత్ నెంబర్ 34, 35, 36, 37, 38 లో విస్తృతంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో 'సర్' ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.