ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డలో అంజలి ఫార్మసీ అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పై ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నకిలీ డాక్టర్ బానోతు శ్రీను, ఫార్మసీ సర్టిఫికెట్ లేని మెడికల్ షాప్ నిర్వాహకుడు మదరపు కరుణాకర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి బీపీ ఆపరేటర్, సెథాస్కోప్, క్లినిక్ కు సంబంధించిన వస్తువులు, మెడికల్ షాప్ వస్తువులు, 4 గర్భ నిరోధక మాత్రల కిట్స్, ఇతర మందులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న పరికరాలు, వస్తువులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.