వృద్ధుల వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్లు ఆవిష్కరణ

2చూసినవారు
వృద్ధుల వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్లు ఆవిష్కరణ
హైదరాబాద్, ఉప్పల్ లోని ఘట్‌కేసర్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం, డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వాహనాలను ఇతర వాహనదారులు సులభంగా గుర్తించేలా రూపొందించిన ప్రత్యేక “సీనియర్ సిటీజన్” స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం వయోధికులకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోట రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, ముత్యాల గౌడ్, వెంకట్రామిరెడ్డి, ఇన్నారెడ్డి, కృష్ణ మూర్తి, జివి. రాజీ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, చలపతి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్