మల్లాపూర్ లోని ఒక డ్రై ఫ్రూట్స్ షాపులో నాసిరకం, పురుగులతో నిండిన డ్రై ఫ్రూట్స్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితుడు భరత్ ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్ పురుగులతో ఉండటాన్ని గమనించి, షాపు యజమానిని ప్రశ్నించగా, అతను తప్పు ఒప్పుకోకుండా బెదిరించినట్లు భరత్ తెలిపారు. ఈ డ్రై ఫ్రూట్స్ తిన్న తన పాప అనారోగ్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.