అంబేద్కర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై కూర్చొని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 55 తో ఉన్న నోటిఫికేషన్ జీవో నెంబర్ 29 తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.