నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కూలీ దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. కారు లిఫ్ట్ అడిగినందుకు 18 ఏళ్ల మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్ ను నలుగురు యువకులు అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపినట్లు నాచారం సీఐ ధనుంజయ వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు యువకులను రిమాండ్ కు తరలించారు. జులాయిగా తిరిగే ఈ యువకులు కారు లిఫ్ట్ అడిగినందుకు నరకయాతన పెట్టి చంపినట్లు తెలిపారు.