బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కళాశాలల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. మక్తల్ మహబూబ్ నగర్ కు చెందిన ఎస్ వర్ష (16) శ్రీచైతన్య రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో చదువుతూ గదిలో ఉరేసుకుంది. నిజాంపేట్ కు చెందిన మంజునాథ్ (18) ప్రగతి జూనియర్ కళాశాలలో చదువుతూ, ప్రేమ వ్యవహారంలో ఒత్తిడితో ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.