వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు, కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించి అధికారులకు సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ సత్యనారాయణతో మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు వైద్య
పరీక్షలు నిర్వహించి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు.