
రెజోఫెస్ట్ 2025 ముగింపు: 16 కొత్త స్కూల్స్ ప్రారంభించిన సీజేఐ రమణ
గచ్చిబౌలి స్టేడియంలో రెండు రోజుల రెజోఫెస్ట్ 2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన 48వ ఛీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ 16 కొత్త రెజోనెన్స్ స్కూల్స్‌ను ప్రారంభించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, శాంత బయోటెక్నోస్ ఛైర్మన్ వరప్రసాదొడ్డి, నటులు సాయిదుర్గ తేజ్, మౌళి, దర్శకుడు అనిల్ రావిపూడి విద్యార్థులకు లక్ష్య సాధనపై మార్గనిర్దేశం చేశారు. ఈ ఉత్సవంలో 35 క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.






































