
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజిరి జిల్లా ప్రజలకు కలెక్టర్ మను చౌదరి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని, మహిషాసురుడిని సంహరించిన అమ్మవారిని నవరాత్రులు కొలవడం పండుగ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.





































