వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రాంపూర్ గ్రామంలో బుధవారం ఉదయం అందరూ చూస్తుండగానే శంకర్ నాయక్ అనే వ్యక్తిని సాయి కుమార్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. భూతగాదాలు, పాత కక్షలే ఈ హత్యకు కారణమని సమాచారం. హత్య చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, దారూర్ సిఐ రఘురామ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.