వికారాబాద్: అనుమానం.. కుటుంబాన్ని అంతమొందించాడు!

2చూసినవారు
వికారాబాద్: అనుమానం.. కుటుంబాన్ని అంతమొందించాడు!
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఆగ్రహించిన యాదయ్య తన భార్య అలివేలు, ఆమె సోదరి హన్మమ్మ, చిన్న కుమార్తె శ్రావణిని కత్తితో హతమార్చి చివరగా తానే ఉరివేసుకున్నాడు. పెద్ద కుమార్తె అపర్ణ గాయాలతో బయటపడింది. కుటుంబ కలహం, అనుమానాలు, కోపం చివరికి నలుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.