వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఎన్కెపల్లికి చెందిన హరిశంకర్‌గౌడ్(23) సోమవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా, పత్తి లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మొదట కుటుంబసభ్యులు ఇది హత్య అని భావించినా, పోలీసులు విచారణలో ఇది రోడ్డు ప్రమాదంగా నిర్ధారించారు. చోన్గొముల్ ఎస్సై భరత్ కుమార్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.