
శివాలయంలో హుండీ దొంగతనం: బీజేపీ నేతల ఆగ్రహం, పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
ఐఎస్ సదన్ శివాలయంలో జరిగిన హుండీ దొంగతనంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చౌరస్తా వద్ద బీజేపీ, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలపై దాడులు, దొంగతనాలు పెరిగిపోయాయని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, జిల్లా నాయకుడు జంగం మధుకర్ రెడ్డి ఆరోపించారు. 24గంటల్లో దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.


































