కుత్బుల్లాపూర్ జోన్ ప్రజావాణిలో 18 ఫిర్యాదులు

274చూసినవారు
కుత్బుల్లాపూర్ జోన్ ప్రజావాణిలో 18 ఫిర్యాదులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 18 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో శానిటేషన్ విభాగంలో 1, టౌన్ ప్లానింగ్ విభాగంలో 8, ఇంజనీరింగ్ సెక్షన్‌లో 9 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు సమాచారం. జోనల్ కమిషనర్ ఈ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలకై ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్