కనీస వేతనం రూ. 18,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా వర్కర్లు స్టేషన్ ముందే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.