బోయిన్ పల్లి: బీసీల హక్కుల కోసం బీజేపీ నాయకుల ధర్నాకు తరలింపు

208చూసినవారు
బోయిన్ పల్లి: బీసీల హక్కుల కోసం బీజేపీ నాయకుల ధర్నాకు తరలింపు
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శనివారం బీసీ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి జూబ్లీ బస్ స్టేషన్ వైపు బయలుదేరారు. బీసీ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాకు బోయిన్ పల్లి ప్రాంతం నుంచి కూడా విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, బీసీలకు సరైన న్యాయం చేయాలని, తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సత్యమూర్తి, రమేష్ బీసీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్