హోటల్ నుండి వచ్చే మంటలే అగ్నిప్రమాదానికి కారణం: బాధితులు

348చూసినవారు
అమీర్ పేట్ మైత్రీవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 షట్టర్లు దగ్ధమై, సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న హోటల్ నుండి వచ్చిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ఈ హోటల్పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే తమను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్