బాలాజీ లేఅవుట్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ భరోసా

229చూసినవారు
బాలాజీ లేఅవుట్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ భరోసా
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గాజులరామారం సర్కిల్ బాలాజీ లేఅవుట్ లోని కాలనీల వాసులు ఎదుర్కొంటున్న అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను ఆదివారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడుతూ, తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓక్షిత కాలనీ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్