హైదరాబాద్: రౌడీషీటర్ కత్తితో బీభత్సం!

64చూసినవారు
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ ప్రాంతంలో రౌడీషీటర్ నసీర్ కత్తితో బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న వారిపై, కనిపించని వారిపై, వాహనాలపై కత్తితో దాడి చేశాడు. బంగారం, బ్యాగులు, మొబైల్స్ స్నాచింగ్ వంటి అనేక నేరాల్లో ప్రమేయం ఉన్న నసీర్, గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్