హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన మాదన్నపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల పురోగతి, రికార్డులు, సిబ్బంది హాజరు, క్రమశిక్షణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంచాలని, పీపుల్ వెల్పేర్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.