సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్: 66 ఖాళీల భర్తీకి హైకోర్టు ప్రకటన

8చూసినవారు
సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్: 66 ఖాళీల భర్తీకి హైకోర్టు ప్రకటన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నియామక పరీక్ష తేదీలు, హాల్‌టికెట్ల వివరాలు త్వరలో హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించారు.