పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో 6 గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో శరీరం నుంచి బుల్లెట్ను విజయవంతంగా బయటకు తీశారు. ప్రస్తుతం సోనును 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత మరో సర్జరీ అవసరమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై
బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, నిందితుడికి వెంటనే శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.