జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నామినేషన్ల స్వీకరణ మూడవ రోజు బుధవారం సజావుగా కొనసాగింది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అర్రోళ్ల ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పి. సాయిరాంకు సమర్పించారు. ఇది ఈ రోజు నమోదైన 10వ నామినేషన్‌గా రికార్డయింది.