సరస్వతి పుష్కరాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు

79చూసినవారు
సరస్వతి పుష్కరాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు
సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం సిటీ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నటు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని బుధవారం అధికారులు స్పష్టం చేశారు. 40 మంది కలిసి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం https: //www. tgsrtcbus. in/ సంప్రదించండి.

సంబంధిత పోస్ట్