శివరాత్రి ఆర్చ్ తొలగించకపోవడంతో రహదారిపై వాహనాల రద్దీ

367చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సూరారం ఉమామహేశ్వర ఆలయం వద్ద శివరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన కట్టెల ఆర్చ్‌ను తొలగించకపోవడం వల్ల నర్సాపూర్–బాలానగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఆదివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జీడిమెట్ల ట్రాఫిక్ సిబ్బంది, జిహెచ్ఎంసి అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్