
ప్రగతి నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ లోని ప్రగతి నగర్ చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీ వాసవి సేవక్ ఆధ్వర్యంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. సంస్థ అధ్యక్షులు అల్లాడి మహేష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో వాసవి సేవక్ కమిటీ సభ్యులు సెక్రెటరీ మురళి, రంజిత్, రుద్ర మూర్తి, శ్రవణ్, సంతోష్, రమేష్, సందీప్ పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


































