యాకుత్‌పురా - Yakutpura

పోలీసుల రక్తదానం: అమరవీరులకు నివాళి

పోలీస్ అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా, సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని మలక్‌పేట, సైదాబాద్ ఏసీపీల ఆధ్వర్యంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎలైట్ కన్వెన్షన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చాదర్‌ఘాట్, డబిర్ పుర, మలక్‌పేట, సైదాబాద్, మదన్నపేట పోలీస్ స్టేషన్ల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సైదాబాద్ ఏసీపీ ఎస్. వెంకట్ రెడ్డి, మలక్‌పేట ఏసీపీ కె. సుబ్బరామి రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు కూడా రక్తదానం చేశారు.

వీడియోలు


హైదరాబాద్